లండన్ : లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ఈ అంతర్జాతీయ ట్రావెల్ హబ్ నుంచి రాకపోకలు సాగించే 2.90 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 1,350 విమానాలను రద్దు చేశారు. ఇదిలావుండగా, ఈ విమానాశ్రయం అధికారులు ఇచ్చిన ఎక్స్ పోస్ట్‌లో, శుక్రవారం పాక్షికంగా విమానయాన సేవలను పునరుద్ధరించినట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు శనివారం నుంచి పునఃప్రారంభమవుతాయని ప్రకటించారు.