Sudan | ఏడాదికిపైగా సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య నెలకొన్న అంతర్యుద్ధంతో నలిగిపోతున్న నార్త్ ఆఫ్రికా దేశమైన సుడాన్ (Sudan)లో తాజాగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కుండపోత వర్షాల కారణంగా ఆనకట్ట కూలిపోయింది (dam collapsed). ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గత కొన్ని రోజులుగా సుడాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాలకు వరదలు సంభవించాయి. ప్రధాన నదులు, డ్యామ్‌లు పూర్తిగా నీట మునిగి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో పోర్ట్ సుడాన్‌లోని ఎర్ర సముద్రం నగరానికి (Red Sea city) మంచి నీటి సరఫరాకు ప్రధాన వనరుగా ఉన్న ఆర్బాత్ డ్యామ్ (Arbaat Dam) కూలిపోయింది. దీంతో ఆ వరదంతా సమీపంలోని గ్రామాల్లోకి పోటెత్తింది. ఈ వరదలకు అనేక ఇళ్లు ధ్వంసం కాగా.. వాహనాలు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. అనేక మంది వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. పలువురు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కొండ ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఈ ఘటనలో సుమారు 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని స్థానిక మీడియా నివేదించింది.
Also Read..
Actor Darshan | కన్నడ నటుడు దర్శన్‌కు జైల్లో రాజభోగాలు.. ఏడుగురు అధికారులు సస్పెండ్
Uber: ఉబర్‌కు 32.4 కోట్ల డాలర్ల జరిమానా
Shakib Al Hasan: షకీబ్ అల్ హసన్‌పై బ్యాన్ విధించండి.. బంగ్లా క్రికెట్ బోర్డుకు లీగల్ నోటీసులు