గాజాలో హమాస్ పాలన ముగింపు
యుద్ధంతో అతలాకుతలమైన గాజాలో తన 20 ఏండ్ల పాలనకు ముగింపు పలుకుతూ హమాస్ సోమవారం తన అత్యవసర పాలక మండలిని రద్దు చేసింది. 2007లో గాజాలో హమాస్ పాలన మొదలైంది. హమాస్ తాజా చర్యతో గాజా ప్రాంతంలో పౌర పాలనను అమలు చేయడానికి ఏర్పాటైన గాజా జాతీయ పరిపాలనా కమిటీ(ఎన్‌సీఏజీ)కి మార్గం సుగమం చేస్తున్నది.
- పౌర పాలనకు మార్గం సుగమం
న్యూఢిల్లీ : యుద్ధంతో అతలాకుతలమైన గాజాలో తన 20 ఏండ్ల పాలనకు ముగింపు పలుకుతూ హమాస్ సోమవారం తన అత్యవసర పాలక మండలిని రద్దు చేసింది. 2007లో గాజాలో హమాస్ పాలన మొదలైంది. హమాస్ తాజా చర్యతో గాజా ప్రాంతంలో పౌర పాలనను అమలు చేయడానికి ఏర్పాటైన గాజా జాతీయ పరిపాలనా కమిటీ(ఎన్‌సీఏజీ)కి మార్గం సుగమం చేస్తున్నది. ఎన్సీఏపీ పర్యవేక్షణ బాధ్యతను బోర్డ్ ఆఫ్ పీస్(బీవోపీ) నిర్వహిస్తుంది. ఇది అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలోని ఒక అంతర్జాతీయ కూటమి.
గాజాలో రోజువారీ పరిపాలన నుంచి తాము వైదొలగడానికి సిద్ధంగా ఉన్నట్లు తీవ్రవాద గ్రూపు హమాస్ ఇదివరకే ప్రకటించింది. నిరాయుధీకరణ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. జాతీయ కమిటీ తన బాధ్యతలను స్వీకరించే వరకు ఆ కమిటీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు జాతీయ స్థాయిలో ఆమోదయోగ్యమైన వ్యక్తిని నియమించాలని హమాస్ నిర్ణయించినట్లు ఆ గ్రూపు ప్రతినిధిని ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

