బలోచిస్తాన్ : పాకిస్థాన్(Pakistan)లోని పంజాబ్‌కు చెందిన 9 మంది బస్సు ప్రయాణికుల్ని మిలిటెంట్లు కాల్చి చంపారు. బలోచిస్తాన్ ప్రావిన్సులోని ఓ బస్సు నుంచి వాళ్లను కిందకు దించి ఈ ఘటనకు పాల్పడ్డారు. ఆ ప్రావిన్సులోని జోబ్ ఏరియాలో ఉన్న జాతీయ హైవేపై ప్రమాదం జరిగింది. ప్యాసింజెర్ల ఐడీ కార్డులను చెక్ చేసి మరీ ప్రయాణికులను బస్సు నుంచి దించారు. క్వెట్టా నుంచి లాహోర్ వెళ్తున్న 9 మందిని కాల్చేశారు. ప్రాణాలు కోల్పోయిన 9 మంది ప్రయాణికులు పంజాబ్ ప్రావిన్సుకు చెందినవారే. మృతదేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం ఆస్పత్రిక పంపారు. బలోచిస్తాన్లో తిరుగుతున్న వివిధ ప్రావిన్సులకు చెందిన బస్సు ప్రయాణికులపై తిరుగుబాటుదారులు దాడులకు దిగుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ గ్రూపు కూడా ప్రకటన చేయలేదు.