Arun Maini | లండన్: టాప్ ఎండ్ యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 6.7 అంగుళాల స్క్రీన్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నది. అయితే దీనిని పోలిన 6.74 అడుగుల పొడవైన నమూనాను భారత సంతతి యూట్యూబర్, టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ మైనీ రూపొందించారు. గ్యాడ్జెట్ స్పెషలిస్ట్ మాథ్యూ పెర్క్స్ సహకారంతో దీనిని తయారు చేశారు. దీనిలో భారీ కెమెరాలు అమర్చారు.
దీనిలోని గేమింగ్ యాప్‌లను ఉపయోగించుకోవడానికి వీలుగా తయారు చేశారు. దీనిని స్టాండ్‌పై అమర్చి, వీధుల్లోకి తీసుకెళ్లినపుడు, చూసినవారంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్ ప్రతిరూపంగా దీనికి గిన్నిస్ ప్రపంచ రికార్డు లభించింది. బ్రిటన్‌లో ఉంటున్న అరుణ్ టెక్నాలజీ సమాచారాన్ని ‘మిస్టర్హూజ్దబాస్’ యూట్యూబ్ చానల్ ద్వారా అందిస్తూ ఉంటారు.