మోనోలిత్.. ఇప్పుడు లాస్ వెగాస్‌లో ప్రత్యక్షం

లాస్ వెగాస్ : గత వారం రోజులుగా ప్రత్యక్షం కావడం, వెనువెంటనే అదృశ్యమవుతూ ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న మోనోలిత్ ఏకశిలా ఫలకం.. ప్రస్తుతం లాస్ వెగాస్ వీధిలో ప్రత్యక్షమైంది. మూడు వైపుల తల ఉన్న ఏకశిల వస్తువులు.. ఇటీవల ఉటా, రొమేనియా, కాలిఫోర్నియాలలో అలా కనిపించి.. ఇలా మాయమయ్యాయి. ఈ ప్రాంతాల్లో కనిపించిన వస్తువు మాదిరిగానే.. లాస్ వెగాస్‌లో కనిపించిన నిర్మాణం కూడా ఏమిటో తెలియరాలేదు.
లాస్ వెగాస్ లోని ఫ్రీమాంట్ వీధిలో ప్రత్యక్షం కావడంతో నెటిజెన్ ట్విట్టర్లో షేర్ చేశారు. కాగా మరో మోనోలిత్ వీధి మధ్యలో మెరుస్తూ ప్రత్యక్షం కావడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు. ఇలా అప్పుడే ప్రత్యక్షమై.. కాసేపటికే అదృశ్యం అవుతున్న ఏకశిల రహస్యం మరింత చర్చనీయాంశంగా మారింది. అంతుచిక్కని ఈ వస్తువు కనిపించడంతో ఈ ప్రాంతంలోని అనేక కాసినోలు, హోటళ్ళకు వచ్చే అతిథులు.. ఈ వస్తువు యొక్క వీడియోలు, ఫొటోలను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లాస్ వెగాస్ చుట్టుపక్కల ప్రదేశాల ఉద్యోగులు శుక్రవారం తెల్లవారుజామున ఈ నిర్మాణాన్ని గమనించారని కేటీఎన్వి తెలిపింది. దీని గురించి చెప్పేందుకు వారి వద్ద ఎలాంటి సమాచారం లేదు.
Fridays in Vegas always bring surprises. Did anyone call this one? #Monolith pic.twitter.com/BRVhITrlpX
— Circa Las Vegas (@CircaLasVegas) December 4, 2020
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- వేములవాడలో చిరుతపులి కలకలం
- అన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు : సీఎం
- కష్టాల్లో భారత్.. కెప్టెన్ రహానే ఔట్
- రిపబ్లిక్ డే పరేడ్.. ట్రాఫిక్ ఆంక్షలు
- 23 వరకు ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక బస్‌పాస్ కౌంటర్
- టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్‌లు
- మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ
- జీహెచ్ఎంసీ గెజిట్ వచ్చేసింది..
- బస్‌కు వ్యాపించిన మంటలు.. ఆరుగురు మృతి
- మూడో వికెట్ కోల్పోయిన భారత్