Indian Restaurant | యూకేలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇండియన్ రెస్టారెంట్ (Indian Restaurant)కు వెళ్లిన నలుగురు వ్యక్తులు అక్కడ ఫుడ్ తిని బిల్లు కట్టకుండా ఉడాయించారు. వారు రెస్టారెంట్ నుంచి పరులు తీయడాన్ని గుర్తించిన వెయిటర్ వారి వెంటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ప్రముఖ వార్తా సంస్థ ది ఇండిపెండెంట్ ప్రకారం.. ఇంగ్లాండ్ (England)లోని నార్తాంప్టన్‌లో (Northampton) గల సాఫ్రాన్ రెస్టారెంట్ (Saffron restaurant)లో ఆగస్టు 4న ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు యువకులు రెస్టారెంట్లోకి ప్రవేశిస్తారు. అక్కడ రుచికరమైన ఫుడ్.. కర్రీస్, లాంబ్ చాప్స్ వంటి ఆహార పదార్థాలను ఆర్డర్ చేసుకుని బాగా లాగించేస్తారు. మొత్తం 197.30 పౌండ్ల విలువైన ఫుడ్‌ను తింటారు. దీని విలువ భారతీయ కరెన్సీలో దాదాపు రూ.23 వేలు. ఫుడ్ తినడం అయిపోగానే నలుగురు వ్యక్తులూ బిల్లు కట్టకుండా (Without Paying Rs 23,000 Bill) తమ టేబుల్ నుంచి రెస్టారెంట్ డోర్‌వైపు పరుగులు తీస్తారు. గమనించిన వెయిటర్ వారిని వెంబడిస్తారు. ఇందుకు సంబంధించిన వీడియోని సదరు రెస్టారెంట్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
‘నిన్న రాత్రి (ఆగస్టు 4) 10:15 గంటలకు నలుగురు యువకులు మా రెస్టారెంట్లోకి ప్రవేశించారు. రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించి బిల్లు కట్టకుండా వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇలాంటి మోసాల పట్ల ఇతర రెస్టారెంట్ల వాళ్లు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము. వీడియోలో ఉన్న వ్యక్తులను గుర్తించినట్లైదే, లేదా వారి గురించిన సమాచారం తెలిస్తే దయచేసిన మాకు చెప్పండి. లేదంటే పోలీసులతోనైనా వారి సమాచారం పంచుకోండి’ అని సదరు రెస్టారెంట్ తన పోస్ట్‌లో విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
The Great British Curry Robbery: History Repeats Itself as UK Dinners Dash from Restaurant Without Paying!
CCTV captured the moment four customers are chased from the “Saffron” restaurant in Northampton 🇬🇧 – after running up a bill of almost £200. pic.twitter.com/8SkagwvFRq
— RT_India (@RT_India_news) August 11, 2025
Also Read..
India-China flights | ఐదేళ్ల తర్వాత భారత్-చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసెస్..!
అమెరికాలో సిక్కు వ్యక్తిపై విద్వేషపూరిత దాడి.. అపస్మారక స్థితిలో బాధితుడు
Tammy Bruce | భారత్, పాకిస్థాన్‌తో సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండదు : అమెరికా