లాస్ఏంజెల్స్, ఆగస్టు 12: అమెరికాలోని లాస్ఏంజెల్స్లో ఓ 70 ఏండ్ల సిక్కు వ్యక్తిపై విద్వేషపూరిత దాడి చోటుచేసుకుంది. నార్త్ హాలీవుడ్లో ఓ గురుద్వారాకు సమీపంలో చోటుచేసుకున్న ఈ దాడిలో హర్పాల్ సింగ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతడికి దవాఖానలో మూడు శస్త్ర చికిత్సలు చేసినట్టు బాధితుడి సోదరుడు తెలిపాడు.
గత సోమవారం గురుద్వారాకు సమీపంలో హర్పాల్ సింగ్ వాకింగ్ చేస్తుండగా, గుర్తుతెలియని ఓ వ్యక్తి మోటార్‌సైకిల్‌పై వచ్చి గోల్ఫ్ ఆడే కర్రలతో దాడికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఘటనను పోలీసులు విద్వేషపూరిత దాడిగా భావించటం లేదని బాధితుడి సోదరుడు వాపోయారు.