Haltback Bunkers | న్యూఢిల్లీ : నార్వేజియన్ చమురు, నౌకాయాన కంపెనీ హాల్ట్బ్యాక్ బంకర్స్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. నార్వేలోని నౌకాశ్రయాల్లో ఉన్న అమెరికన్ సైనిక దళాలకు ఇంధన సరఫరాను తక్షణమే నిలిపేస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య శుక్రవారం జరిగిన చర్చల తీరుపై కంపెనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరిగిన అత్యంత చెత్త షోను చూశామని వ్యాఖ్యానించింది. వెన్నుపోటు పొడిచే టీవీ షోను అమెరికా ఏర్పాటు చేసినప్పటికీ, జెలెన్స్కీ గొప్ప సంయమనం పాటించారని, మొత్తం ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పింది.