Artificial Intelligence | న్యూయార్క్: కృత్రిమ మేధ (ఏఐ) త్వరలో జర్నలిజంలోనూ అడుగిడనున్నది. వార్తా కథనాలు రాయడంలో జర్నలిస్టులకు సహాయపడే ఏఐ పవర్డ్ టూల్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది. ఈ ఏఐ టూల్‌ను వినియోగించేలా ప్రముఖ న్యూస్ ఏజెన్సీలతో చర్చిస్టున్నట్టు తెలిపింది.
ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఈ ఏఐ టూల్ లార్జ్ లాంగ్వేజ్ మాడల్ (ఎల్ఎల్ఎం) ఆల్గారిథంపై పనిచేయనున్నది. ఇది ఆకర్షణీయంగా హెడ్డింగ్స్ పెట్టడంలోనూ, విభిన్న వార్త కథనాలను రాయడంలోనూ జర్నలిస్టులకు సహాయకారిగా ఉంటుందని, జర్నలిస్టుల పనితీరును మెరుగుపడేలా చేస్తుందని గూగుల్ వెల్లడించింది.