దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ తన ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు సంబంధించిన నియమావళి విషయాల్లో మిగతా కంపెనీలకు మార్గదర్శిగా ఉండే ఈ సంస్థ.. తమ ఉద్యోగులకు ఇచ్చే పేరెంటల్ లీవ్‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఇప్పటి వరకూ ఉద్యోగులకు పేరెంటల్ లీవ్ కింద 12 వారాల సెలవుల లభించేవి. వీటిని 18 వారాలకు పెంచుతున్నట్లు గూగుల్ ప్రకటించింది. అంతేకాదు బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులకు ఇంతకు ముందు 18 వారాలు సెలవులు ఇచ్చేదీ సంస్థ.
ఇప్పుడు ఈ సెలవులను 24 వారాలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ ఈ తాజా నిబంధనలు అమలవనున్నాయి. ఉద్యోగుల మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది.
అలాగే ఈ కంపెనీ తన ఉద్యోగులకు 15 రోజుల పెయిడ్ వెకేషన్ ఇచ్చేది. వీటిని 20 రోజులకకు పెంచింది. వచ్చే ఏప్రిల్ 2 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమలవుతాయని పేర్కొంది.