Google Employee | గంట పని.. జీతం మాత్రం రూ.1.2 కోట్లు..!
Google Employee | ఏ కంపెనీలో అయినా ఉద్యోగులు కనీసం రోజుకు 8 నుంచి 9 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే జీతంలో కోత విధిస్తారు. కానీ, గూగుల్‌లో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న దెవాన్ అనే 20 ఏళ్ల టెకీ మాత్రం రోజుకు గంట మాత్రమే పనిచేస్తున్నాడట. జీతం మాత్రం ఏడాదికి రూ. 1.24 కోట్లు తీసుకుంటూ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.
Google Employee | ఏ కంపెనీలో అయినా ఉద్యోగులు కనీసం రోజుకు 8 నుంచి 9 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే జీతంలో కోత విధిస్తారు. ఒక్కోసారి అంతకంటే ఎక్కవ సమయమే పనిచేయాల్సి వస్తుంటుంది. అన్ని గంటలు పనిచేసినా జీతం మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. అయితే, దిగ్గజ టెక్ కంపెనీ అయిన గూగుల్ (Google)లో పనిచేస్తున్న ఓ ఇంజినీర్ మాత్రం రోజుకు 1 గంట మాత్రమే వర్క్ చేస్తూ.. ఏడాదికి ఏకంగా రూ.కోటికిపైనే వేతనం అందుకుంటున్నాడు. షాక్ అవుతున్నారు కదూ.. మీరు విన్నది నిజమే.
గూగుల్‌లో ఉద్యోగం అంటే అదో కల. అందులో ఉద్యోగం రావటం అంతా అదృష్టంగా భావిస్తుంటారు. ఎందుకంటే జీతం ఎక్కువగా ఉండటంతోపాటు.. గూగుల్‌లో జాబ్ కొడితే లైఫ్‌లో సెటిల్ అయిపోయినట్టే అన్న భావన. అయితే, అందుకు తగినట్లుగానే కష్టపడాల్సి ఉంటుంది మరి. ఎవరైనా సరే కంపెనీ నిర్దేశించిన సమయం వరకూ పని చేయాల్సిందే. ఆ తర్వాతే ఇంటికి వెళ్లాలి. కానీ, గూగుల్‌లో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న దెవాన్ అనే 20 ఏళ్ల టెకీ మాత్రం రోజుకు గంట మాత్రమే పనిచేస్తున్నాడట. జీతం మాత్రం ఏడాదికి రూ. 1.24 కోట్లు తీసుకుంటూ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.
దేవాన్ (Devon) గూగుల్‌లోని కోడింగ్ (Coding) విభాగంలో ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాడు. గూగుల్ టూల్స్ అండ్ ప్రొడక్ట్స్ (Google Tools And Products) కోసం కోడింగ్ రాస్తుంటాడు. అయితే అతడు రోజుకు ఒక గంట మాత్రమే పనిచేస్తున్నాడు. మిగతా టైమ్‌లో బీచ్‌లు, పార్క్‌లు సహా రోజూ బోలెడు జాలీ రైడ్స్‌కి వెళ్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తాడట. అంటే నెలలో మొత్తంగా 24 నుంచి 28 గంటలు మాత్రమే వర్క్ చేస్తాడు. అలా గంట పనికి ఏడాదికి రూ.1.24 కోట్లు తీసుకుంటున్నాడట. దాంతో పాటు బోనస్‌లు కూడా అందుకుంటున్నాడు. ఈ విషయాన్ని దేవాన్నే స్వయంగా వెల్లడించాడు.
‘నేను ఎక్కువ గంటలు పని చేయాలనుకుంటే స్టార్టప్ కంపెనీలో ఉండేవాడిని. ఎక్కువ గంటలు పనిచేయాలనే ఒత్తిడి నాకు లేదు. చాలా మంది వ్యక్తులు వర్క్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకునేందుకు, ఇతర ప్రయోజనాల కోసం గూగుల్‌ను ఎంచుకుంటారు. మీరు యాపిల్ కంపెనీలో కూడా పని చేయొచ్చు. యాపిల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఎక్కువ గంటలు పని చేస్తారు. కానీ, గూగుల్‌లో వారు చేసే పని వారికి తెలుసు. నేను కూడా వేల మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లలో ఒకడినే. అయితే, నేను కష్టపడకుండా వేగంగా పని చేసేందుకే ఇష్టపడతాను’ అంటూ దెవాన్ చెబుతున్నాడు.
Also Read..
Serena Williams | రెండోసారి తల్లైన సెరెనా విలియమ్స్.. సోషల్ మీడియా ద్వారా వెల్లడి
Joe Biden | భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు.. 4 రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్న బైడెన్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

