AI technology | డీఎన్ఏను చదివి రోగాన్ని చెప్పేస్తుంది..‘ఆల్ఫాజీనోమ్’ను అభివృద్ధి చేసిన గూగుల్ డీప్‌మైండ్
మనిషి జన్యు నిర్మాణాన్ని ఆసాంతం చదివి, అందులో లోపాల్ని పసిగట్టే ‘ఏఐ (కృత్రిమ మేధ) టెక్నాలజీ’ని గూగుల్ డీప్‌మైండ్ తయారుచేసింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత మానవ డీఎన్ఏలోని పెద్ద పెద్ద భాగాలన్నీ చదవగలదు.
- ‘ఆల్ఫాజీనోమ్’ను అభివృద్ధి చేసిన గూగుల్ డీప్‌మైండ్
- కొత్త చికిత్సలను కనుగొనటంలో సైంటిస్టులకు సహాయం
వాషింగ్టన్, జనవరి 31: మనిషి జన్యు నిర్మాణాన్ని ఆసాంతం చదివి, అందులో లోపాల్ని పసిగట్టే ‘ఏఐ (కృత్రిమ మేధ) టెక్నాలజీ’ని గూగుల్ డీప్‌మైండ్ తయారుచేసింది. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత మానవ డీఎన్ఏలోని పెద్ద పెద్ద భాగాలన్నీ చదవగలదు. అంతేగాక దానిని విశ్లేషించి జన్యు ఉత్పరివర్తనాలు, జన్యు నియంత్రణను కూడా అంచనా వేయగలదు. వ్యాధికి కారణమయ్యే జన్యు మార్పులను గుర్తించటంలో, కొత్త చికిత్సలను కనుగొనటంలో సైంటిస్టులకు ‘ఆల్ఫాజినోమ్’ అత్యంత సహాయకారిగా మారనున్నది. ఈ ఏఐ టెక్నాలజీ డీఎన్ఏ కోడ్‌లో 10 లక్షల అక్షరాల వరకు విశ్లేషిస్తుంది.
మానవులు, ఎలుకల జెనెటిక్ డాటాను చదవగలిగే విధంగా ఈ ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. వివిధ అవయవయాల్లో జీవ సంబంధమైన మార్పులను వైద్యులు కనుగొనేందుకు దీని వల్ల అవకాశం ఏర్పడుతుందని తెలిసింది. మొత్తం జీవితాన్ని నియంత్రిస్తున్న ‘బయలాజికల్ కోడ్’పై పరిశోధనను వేగవంతం చేస్తుందని ‘డీప్‌మైండ్’ సైంటిస్ట్ నటాషా లాటిషేవా అన్నారు. జన్యుపరమైన చికిత్సల అభివృద్ధికి ఈ టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతుందన్నారు. గుండె జబ్బులు, రోగ నిరోధకత లేకపోవటం, మానసిక రుగ్మతలు, పలు రకాల క్యాన్సర్లు..ఇవన్నీ జన్యు మార్పులతో ముడిపడి ఉన్నాయి. ఇక్కడే ‘ఆల్ఫాజినోమ్’ వైద్యులకు సహాయకారిగా మారనున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
ట్రెండింగ్ వార్తలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్

