వాషింగ్టన్ : చేతిలో బిట్ కాయిన్ పట్టుకొని ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 12 అడుగుల బంగారు విగ్రహాన్ని యూఎస్ క్యాపిటల్ భవనం ఎదుట ప్రతిష్ఠించారు. ఇది ప్రజలను ఆకర్షించడంతో పాటు వివాదానికి కేంద్రమైంది. ఫెడరల్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు తగ్గింపును ప్రకటించిన వెంటనే ఈ విగ్రహావిష్కరణ జరిగింది.
క్రిప్టో కరెన్సీ పెట్టుబడిదారులు ఈ విగ్రహానికి నిధులిచ్చినట్టు ఏబీసీ సంస్థ తెలిపింది. భవిష్యత్తు డిజిటల్ కరెన్సీ, ద్రవ్య విధానం, ఆర్థిక మార్కెట్లలో ఫెడరల్ ప్రభుత్వ పాత్రపై చర్చను రేకెత్తించడానికి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా ట్రంప్‌కు ఉన్న వైఖరిని ప్రశంసిస్తూ పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.