శనివారం 04 జూలై 2020
International - Jun 08, 2020 , 12:39:32

హోటల్‌లో ఉండే ప్రతి వస్తువూ బంగారమే!

హోటల్‌లో ఉండే ప్రతి వస్తువూ బంగారమే!

వియాత్నంలోని ఓ హోటల్‌ను పూర్తిగా బంగారంతోనే నిర్మించారు. హోటల్‌ ఒకటే బంగారం కాదు. అందులో ఉండే ప్రతి వస్తువును బంగారంతోనే రూపొందించారు. అదే హనోయ్‌ గోల్డెన్‌ లేక్‌. ఇప్పటివరకు దుబాయ్‌లోని బుర్జ్ అల్ అర్బ్ హోటల్‌ మాత్రమే గోల్డెన్ హోటల్‌గా పేరొందింది. ఆ హోటల్‌లో ఎలివేటర్లను (లిఫ్టులు) 22 క్యారెట్ల బంగారంతో అలంకరించారు. అయితే, వియత్నాంలోని గోల్డెన్ లేక్ హోటల్‌ అలంకరణకు అంతకంటే ఎక్కువే ఖర్చు చేశారు. ప్రపంచంలో మరే హోటల్‌ లేనట్లుగా భవనం మొత్తాన్ని బంగారంతో నింపేసిన ఏకైక హోటల్‌.

హోటల్‌లో ఉండే బాత్‌ టబ్‌లు, ట్యాప్స్‌, ఫర్నీచర్‌ ఇలా నీరు తాగే గ్లాస్‌ నుంచి వాష్‌రూంలో ఉపయోగించే జగ్‌ వరకు అన్నీ బంగారంతో చేసినవే. అది కూడా 24 క్యారెట్స్‌ బంగారాన్ని ఉపయోగించడం గమనార్హం. 2009 నుంచి ఈ హోటల్‌కు బంగారు పూత వేయడం ప్రారంభించారు. పదేళ్ల వ్యవధిలో దాదాపు అన్ని పనులు పూర్తి కావడంతో ఇప్పుడు హోటల్ బంగారు కాంతులతో దగదగా మెరిసిపోతున్నది. ఈ హోటల్‌లో ఒక్క రాత్రి స్టే చేయాలంటే 250 డాలర్లు చెల్లించాలి. అంటే.. భారత కరెన్సీలో రూ.18,906లు అవుతుంది.logo