వాషింగ్టన్, నవంబర్ 9: హైదరాబాద్‌కు చెందిన ఘజాలా హష్మీ అమెరికాలోని వర్జీనియా స్టేట్ సెనేట్‌కు వరుసగా మూడో సారి ఎన్నికయ్యారు. ఆ రాష్ట్రంలో చట్టసభకు ఎన్నికైన మొదటి ఇండియన్-అమెరికన్, ముస్లిం మహిళగా ఆమె ఇప్పటికే చరిత్ర సృష్టించారు. తన గెలుపుపై ఆమె మాట్లాడుతూ, ‘గత నాలుగేండ్లుగా ఇక్కడ చాలా బాగా పనిచేశాం. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది.
ఓటర్లు, మద్దతుదారులు నాపై ఉంచిన విశ్వాసానికి ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడివారి ఉజ్వల భవిష్యత్తు కోసం మా పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని అన్నారు. కాగా, అమెరికాలో స్టానిక, రాష్ట్ర చట్టసభలకు తాజాగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 10 మంది ఇండియన్ అమెరికన్లు ఎన్నికయ్యారు.