అబుదాబి: పాకిస్థానీ పౌరులకు వీసాల జారీని యూఏఈ నిలిపేసింది. అత్యధిక పాకిస్థానీలు ఈ గల్ఫ్ దేశానికి వెళ్లి నేరాల్లో భాగస్వాములవుతున్నారనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకుంది. మానవ హక్కులపై సెనేట్ ఫంక్షనల్ కమిటీ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది.
అధికారికంగా నిషేధం విధిస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుత వీసాలు వాటి గడువు ముగిసే వరకు చెల్లుతాయి. టూరిస్ట్, విజిట్, వర్క్ పర్మిట్ సహా అన్ని క్యాటగిరీల్లోని వీసాలకు ఇకపై కొత్త దరఖాస్తులు స్వీకరించరు.