బెర్లిన్: ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఉక్రెయిన్‌కు భారీ స్థాయిలో ఆయుధాలను అందించేందుకు జర్మనీ సిద్ధమైంది. ఏడు హోవిజ్జర్ ఆయుధాలను ఉక్రెయిన్‌కు ఇవ్వాలని జర్మనీ నిర్ణయించింది. ఈ విషయాన్ని జర్మనీ రక్షణ మంత్రి క్రిస్టినా లాంబ్రెచ్ తెలిపారు. ఉక్రెయిన్‌కు సరైన రీతిలో సహకారం ఇవ్వడంలేదని జర్మనీపై ఇటీవల యురోపియన్ దేశాలు వత్తిడి తెచ్చాయి. ఈ నేపథ్యంలో జర్మనీ కొత్త నిర్ణయాలు తీసుకున్నది. గత నెల చివరలో గెపార్డ్ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపేందుకు జర్మనీ ఓకే చెప్పింది.
నాటో సభ్య దేశాలు ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు పంపిన ఆయుధాల్లో దాదాపు అన్నీ సోవియేట్ కాలం నాటివే. కానీ అమెరికాతో పాటు ఇతర కొన్ని దేశాలకు అత్యాధునిక హోవిజ్జర్లను ఉక్రెయిన్‌కు పంపించాయి. పంజరాబిట్జ్ 2000 ఆర్టిల్లరీ సిస్టమ్స్‌ను ఉక్రెయిన్‌కు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆయుధాలను వాడాలంటే కనీసం 20 మంది ఉక్రెయిన్ సైనికులు శిక్షణ పొందాల్సి ఉంటుంది. అయితే జర్మనీ వద్ద తక్షణమే యుద్ధ రంగంలో వినియోగించేందుకు కొన్ని డజన్ల సంఖ్యలో హోవిజ్జర్లు ఉన్నాయి. మెయిన్టేనెన్స్ స్టాక్‌లో ఉన్న ఏడు హోవిజ్జర్లను ఉక్రెయిన్‌కు పంపిస్తున్నట్లు జర్మనీ తెలిపింది.