న్యూఢిల్లీ, డిసెంబర్ 10: అమెరికాలోని జంతువుల్లో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి అత్యంత వేగంగా ఉందని, వైరస్ వ్యాప్తిని అడ్డుకోకపోతే ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తుందని సైంటిస్టులు హెచ్చరించారు. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తిపై కాలిఫోర్నియాలోని ‘స్క్రిప్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్’ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
‘మానవుల మధ్య వైరస్ సోకిన దాఖలా ఇప్పటివరకు లేదు. అయితే ఆ పరిస్థితి ఎంతో దూరంలో లేదు. ఒకవేళ మానవుల్లో వ్యాప్తి మొదలైతే మహమ్మారిగా మారే ప్రమాదముంది. ఇప్పటివరకు ఈ వైరస్ సోకినవాళ్లలో 50 శాతం మంది మృత్యువాత పడ్డారు’ అని నిపుణులు పేర్కొన్నారు.
హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఇప్పటివరకు జంతువులకే పరిమితమైంది. ఒకే ఒక్క మ్యుటేషన్ గనుక వైరస్‌లో ఏర్పడితే.. అది మానవుల మధ్య వైరస్ వ్యాప్తికి దారితీస్తుంది.