Israel strikes | గాజా (Gaza)లో ఇజ్రాయెల్ (Israel) మారణహోమాన్ని (Israel strikes) సృష్టిస్తోంది. గాజాలోని పలు ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడుతోంది. గాజాలోని నివాస ప్రాంతాలు, ఆసుపత్రులపై విరుచుకుపడుతోంది. తాజాగా ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం 38 మంది పాలస్తీనియన్లు (Palestinians) మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Gaza Health Ministry) తెలిపింది. పలువురు గాయపడినట్లు పేర్కొంది.
కాగా, గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. ఈ గాజా పోరు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 50 వేలు దాటింది. ఈ యుద్ధంలో 55 వేల మందికిపైగా మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సుమారు 1,24,901 మంది గాయపడినట్లు పేర్కొంది. హమాస్‌ను అంతమొందించి ఆ ఉగ్రసంస్థ చెరలో ఉన్న బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ సేనలు తెలిపాయి.
గాజాస్ట్రిప్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఇటీవలే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గాజాస్ట్రిప్‌ను సంపూర్ణంగా స్వాధీనం చేసుకునే వరకు ఇజ్రాయిల్ వెనుకడుగు వేయబోదన్నారు. గాజాస్ట్రిప్ వద్ద భీకర పోరు సాగుతోందని, దాంట్లో ప్రగతి సాధిస్తున్నట్లు ఆయన చెప్పారు. గాజాస్ట్రిప్ ఏరియాను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. విజయం సాధించాలంటే ఆ దిశగానే ప్రయత్నాలు సాగించాల్సి ఉంటుందన్నారు.
Also Read..
Nuclear Bomb | ఇజ్రాయెల్‌పై అణుదాడి హామీ ఇవ్వలేదు.. ఇరాన్ ప్రకటనను ఖండించిన పాకిస్థాన్
Mass Shooting | అమెరికాలో కాల్పులు.. చిన్నారి సహా ముగ్గురు మృతి
PM Modi | ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. అత్యున్నత పురస్కారంతో సత్కరించిన సైప్రస్