గాజా : ఇజ్రాయెల్ దాడుల్లో తాజాగా 51 మంది మరణించినట్లు గాజా స్ట్రిప్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 52,243కు చేరినట్లు పేర్కొంది. హమాస్ ఉగ్రవాద సంస్థతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ దళాలు మార్చి 18న పక్కనబెట్టి, ప్రతి రోజూ దాడులు చేస్తున్నాయి. సైనిక దళాలు బఫర్ జోన్‌ను విస్తరించాయి. రఫాను చుట్టుముట్టాయి. ఈ ప్రాంతంలో 50 శాతం భూభాగంపై పట్టు సాధించాయి.