Biden Pet Commander | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పెంపుడు శునకం ‘కమాండర్’ (Commander) అధ్యక్షుడి రక్షణ సిబ్బందిపై విరుచుకుపడుతోంది. మూడు నెలల్లో ఏకంగా పది సార్లు సీక్రెట్ సర్వీస్ అధికారులను (Secret Service staff) కరిచింది. ఈ విషయాన్ని శ్వేత సౌధం (White House)కూడా అంగీకరించింది.
బైడెన్ కు చెందిన కమాండర్ 2022 అక్టోబరు నుంచి 2023 జనవరి మధ్య కనీసం పది సార్లు సీక్రెట్ సర్వీస్ అధికారులను కరిచింది. కమాండర్ దాడిలో గాయపడిన ఒకరిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స కూడా అందించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ కమాండర్ శునకం.. జర్మన్ షెపర్డ్ జాతికి చెందినదిగా తెలిపింది. ఈ శునకాన్ని బైడెన్ కు ఆయన సోదరుడు జేమ్స్ కానుగా ఇచ్చారట. అయితే, అంతకుముందు మేజర్ అనే శునకం కూడా బైడెన్ వద్ద ఉండేదని.. అది కూడా కమాండర్ లానే కొంత మంది సీక్రెట్ సర్వీస్ అధికారుల్ని కరుస్తుండటంతో దాన్ని అధ్యక్షుడు తన మిత్రుల వద్దకు పంపించేసినట్లు వెల్లడించింది.
Also Read..
Yuvraj Singh | యువరాజ్ సింగ్ ఫ్యామిలీకి బెదిరింపులు.. మహిళ అరెస్ట్
Heavy Rains | వడగళ్ల వర్షంతో విమానానికి రంధ్రం.. అత్యవసర ల్యాండింగ్
Heavy Rains | ఢిల్లీని ముంచెత్తిన వర్షం.. నోయిడాలో వరద నీటిలో చిక్కుకున్న కార్లు