బర్మింగ్‌హామ్: పసందైన విందు, వినోదాలను పంచిపెట్టే బార్లు, రెస్టారెంట్లతో కళకళలాడే ప్రాంతంలో శనివారం రాత్రి దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా, 21 మంది గాయపడ్డారు. అమెరికాలోని అలబామా, బర్మింగ్‌హామ్‌లో ఉన్న ఫైవ్ పాయింట్స్ సౌత్ ఏరియాలో ఈ సంఘటన జరిగింది. బర్మింగ్‌హామ్ అధికారి ట్రుమన్ ఫిట్జ్‌గెరాల్డ్ మాట్లాడుతూ, కాల్పుల్లో గాయపడ్డ నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రజలను బలి తీసుకున్నవారిని గుర్తించి, పట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని చెప్పారు. రెస్టారెంట్లు, బార్లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్లు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో వారాంతాల్లో రద్దీగా ఉంటుంది.