e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home News క్ష‌ణాల్లో కుప్ప‌కూలిన నాలుగు భారీ కూలింగ్ ట‌వ‌ర్లు.. వీడియో వైర‌ల్‌

క్ష‌ణాల్లో కుప్ప‌కూలిన నాలుగు భారీ కూలింగ్ ట‌వ‌ర్లు.. వీడియో వైర‌ల్‌

క్ష‌ణాల్లో కుప్ప‌కూలిన నాలుగు భారీ కూలింగ్ ట‌వ‌ర్లు.. వీడియో వైర‌ల్‌

లండ‌న్‌: ఒక్కొక్క‌టి 117 మీట‌ర్ల ఎత్తున్న భారీ కూలింగ్ ట‌వ‌ర్‌. అలాంటివి నాలుగు ట‌వ‌ర్లు ఒకేసారి కుప్ప‌కూలితే ఎలా ఉంటుంది. ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోలో అదే జ‌రిగింది. ఇంగ్లండ్‌లోని స్టాఫ‌ర్డ్‌షైర్‌లో ఉన్న రూగ్లీ ప‌వ‌ర్ స్టేష‌న్‌కు చెందిన‌ ఈ ఐదు ద‌శాబ్దాల కింద‌టి కూలింగ్ ట‌వ‌ర్‌ల‌ను అక్క‌డి అధికారులు ధ్వంసం చేశారు. బొగ్గు ఆధారిత ప‌వ‌ర్ స్టేష‌న్‌ను 2016లోనే మూసేశారు. ఇప్పుడా ప్ర‌దేశంలో ఇండ్లు, వ్యాపార స‌ముదాయాల‌ను నిర్మించ‌నున్నారు.

ఒకేసారి ఈ నాలుగు ట‌వ‌ర్ల‌ను పేల్చ‌డాన్ని అన్ని యాంగిళ్ల‌లో చూపిస్తోందీ వీడియో. క్ష‌ణాల్లోనే ట‌వ‌ర్లు కూలిపోయి ద‌ట్ట‌మైన దుమ్ముధూళి ఆ ప్ర‌దేశాన్ని క‌మ్మేశాయి. ఈ ట‌వ‌ర్ల‌ను పేల్చుతుంటే చూడ‌టానికి వంద‌ల మంది స్థానికులు అక్క‌డికి వ‌చ్చారు. ఒక‌ప్పుడు 60 ల‌క్ష‌ల గ్యాల‌న్ల నీటిని గంట‌లోనే ఈ ట‌వ‌ర్లు చ‌ల్లార్చేవి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క్ష‌ణాల్లో కుప్ప‌కూలిన నాలుగు భారీ కూలింగ్ ట‌వ‌ర్లు.. వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్‌

Advertisement