వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్(82) ప్రొస్టేట్ (వీర్య గ్రంథి) క్యాన్సర్తో బాధపడుతున్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు ఈ వ్యాధి ఉం దని, క్యాన్సర్ కణాలు ఆయన ఎముకలోకి వ్యాప్తి చెందాయని శుక్రవారం వైద్యులు చెప్పారు.
‘ఈ వ్యాధి సున్నితమైన హార్మోన్లతో కూడినట్టు కనిపిస్తున్నది. దీంతో తమ డాక్టర్లతో ఈ వ్యాధికి చికిత్స తీసుకొనే విషయమై బైడెన్ తన కుటుంబ సభ్యులతో సమీక్ష జరుపుతున్నారు’ అని బైడెన్ కార్యాలయం ఆదివారం వెల్లడించింది.