వాషింగ్టన్, జనవరి 29: అమెరికా అధ్యక్షుడు బైడెన్ బలహీనత, సొంత విదేశాంగ విధానం లేకపోవటం వల్లే ప్రపంచం.. మూడో ప్రపంచ యుద్ధం అంచునకు చేరిందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఒకవేళ అమెరికా అధ్యక్షుడిగా తాను ఉండి ఉంటే.. జోర్డాన్‌లో అమెరికా సైనికుల మృతి, ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలో హింస ఉండేవి కావన్నారు.
ఇటీవల సిరియా సరిహద్దులో జోర్డాన్ వద్ద జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికన్ సైనికులు చనిపోగా, దీనికి కారణం బైడెన్ బలహీనత, విదేశాంగ విధానమేనని ట్రంప్ విమర్శించారు. డ్రోన్ ఘటన నేపథ్యంలో సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో బైడెన్‌పై ట్రంప్ విమర్శలు గుప్పించారు.