కాబూల్, ఆగస్టు 19: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో కాబూల్ ఎయిర్‌పోర్టులో జరిగిన దుర్ఘటనల్లో అఫ్గాన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు సభ్యుడు జాకీ అన్వారీ చనిపోయారు. తాలిబన్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అమెరికాకు చెందిన ఎయిర్‌ఫోర్స్ సీ-17 విమానం ల్యాండింగ్ గేర్ వద్ద అన్వారీ నిల్చున్నారు. ఈ క్రమంలో ఆయన కింద పడి మరణించారని అధికారులు తెలిపారు.