బుధవారం 03 జూన్ 2020
International - Apr 09, 2020 , 13:36:52

గుర్రపుబగ్గీల్లో వృద్ధులకు ఆహారం సరఫరా

గుర్రపుబగ్గీల్లో వృద్ధులకు ఆహారం సరఫరా

హైదరాబాద్: ఆస్ట్రియా రాజధాని వియన్నాలో కరోనా కారణంగా టూరిజం స్తంభించిపోయింది. దాంతో టూరిస్టు అట్రాక్షన్‌గా పేరొందిన గుర్రపుబగ్గీలు పనిలేక మూలన పడ్డాయి. మరోవైపు ఇంటర్‌కాంటినెంటల్ హోటల్ బిజినెస్ లేక మూతపడింది. మరోవైపు చాలా బస్తీల్లో వృద్ధులు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నిరాశాభరిత వాతావరణంలో ఇంటర్‌కాంటినెంటల్ హోటల్ మేనేజర్‌కు మెరుపులాంటి ఐడియా వచ్చింది. వంటగదిని సరఫరాలకు సమాయత్తం చేశాడు. రోజుకు 200 నుంచి 300 బోజనాలకు ఆర్డర్లు వస్తున్నాయి. మరి సరఫరా చేయడం ఎలా? హోటల్‌లో ఉండే వాహనాలు సరిపోవు. బయటి వాహనాలు ఏవీ వచ్చే పరిస్థితుల్లో లేవు. దాంతో గుర్రపుబగ్గీలకు పనిచెప్పారు. ఇంకేముంది భోజనాలు దర్జాగా రాజసంతో సరఫరా చేయడం మొదలైంది. కరోనా వల్ల ఇల్లు కదలకుండా ఉండిపోయిన వృద్ధులు ఈ ఏర్పాటు వల్ల ఎంతగానో సంతోషిస్తున్నారు. భోజనాలు బాగుంటున్నాయి.. ఇంటింటికి తెచ్చిస్తున్న తీరు ఇంకా సరదాగా ఉందంటూ శబాష్ చెప్తున్నారు.


logo