Mayday | బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానంలో ఇంజిన్ వైఫల్యం (engine failure) తలెత్తింది. దీంతో పైలట్ మేడే (Mayday) కాల్ ఇచ్చారు. ఈ ఘటన గత వారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ (United Airlines Flight) నడుపుతున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (Boeing 787-8 Dreamliner) విమానం గతవారం (జులై 25) డల్లాస్ ఎయిర్పోర్ట్ నుంచి మ్యూనిచ్కు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయి దాదాపు 5 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా.. ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. అప్రమత్తమైన పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి మేడే కాల్ ఇచ్చారు. అనంతరం ఏటీసీ సూచనలు, సలహాల మేరకు ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ద్వారా విమానాన్ని డల్లాస్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అసలు ‘మేడే’ అంటే ఏమిటంటే ?
పైలట్ మేడే సంకేతాన్ని పంపించారంటే.. విమానం లేదా దానిలోని ప్రయాణికులకు ప్రాణాంతక పరిస్థితి ఏర్పడిందని అర్థం చేసుకోవాలి. విమాన ప్రయాణాల్లో పైలట్లు మేడే (MAYDAY) అని చెప్పడం అంటే విమానం తీవ్రమైన ప్రమాదంలో ఉందని లేదా అత్యవసర స్థితిని సూచించే అంతర్జాతీయ రేడియో దిస్ట్రెస్ సిగ్నల్. ఈ పదం ఫ్రెంచ్ పదం m’aider (మీ ఆయిదర్) నుండి వచ్చింది. దీని అర్థం “నాకు సహాయం చేయండి” అని విమానయాన నిపుణులు చెబుతున్నారు. ఇటీవలే అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలడానికి ముందు పైలట్ మేడు కాల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
Also Read..
TCS | నో శాలరీ హైక్స్, సీనియర్ల నియామకాలు నిలిపివేత.. ఉద్యోగులకు టీసీఎస్ మరో షాక్..!
Amit Shah | చిదంబరం జీ.. వారు పాక్‌కు చెందిన ఉగ్రవాదులేనని చెప్పడానికి ప్రూఫ్స్ ఉన్నాయి : అమిత్ షా
Amit Shah | పహల్గాం దాడి ఉగ్రవాదుల్లో ముగ్గుర్ని హతమార్చాం.. సిందూర్‌పై చర్చ సందర్భంగా అమిత్ షా