TCS | నో శాలరీ హైక్స్, సీనియర్ల నియామకాలు నిలిపివేత.. ఉద్యోగులకు టీసీఎస్ మరో షాక్..!
TCS | భారత్‌లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) పెద్ద ఎత్తున లేఆఫ్స్ (mass layoffs) ప్రకటించిన విషయం తెలిసిందే. తన మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం మందికి ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది.
TCS | భారత్‌లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) పెద్ద ఎత్తున లేఆఫ్స్ (mass layoffs) ప్రకటించిన విషయం తెలిసిందే. తన మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం మందికి ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది కల్లా దాదాపు 12,200 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడనున్నది. మధ్య స్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగులపై అధికంగా వేటు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే కృతివేశన్ మనీకంట్రోల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అయితే, ఈ లేఆఫ్స్ ప్రకటన అనంతరం సంస్థ తాజాగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. కొత్త ఉద్యోగ నియామకాలను నిలిపివేసినట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరంలో సీనియర్ లెవెల్ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. అదేవిధంగా వార్షిక వేతనాల పెంపు, ఇంక్రిమెంట్లకు కూడా పుల్ స్టాప్ పెట్టినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి.
అంతేకాదు, బెంచ్‌పై నియమిత కాలం కంటే ఎక్కువగా ఉన్న సిబ్బందిని కూడా తొలగించే ప్రక్రియను మొదలు పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే ఉద్యోగులు 35 రోజులకు మించి బెంచ్‌పై ఉండకూదనే నియమాన్ని టీసీఎస్ అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక మధ్యస్థ, సీనియర్ స్థాయి ఉద్యోగుల తొలగింపు ద్వారా టీసీఎస్కి ఏటా 300 నుంచి 400 మిలియన్ డాలర్లు అంటే రూ.2,400 కోట్ల నుంచి రూ. 3,600 కోట్ల వరకూ ఆదా అవుతుందని ఓ సీనియర్ ఐటీ విశ్లేషకుడు అంచనా వేశారు.
టీసీఎస్‌లో 12వేల మంది ఔట్..!
కృత్రిమ మేధ (AI) రాకతో ప్రయోజనాల సంగతి ఏమోగానీ ఐటీ ఉద్యోగాలపై దీని ప్రభావం మాత్రం గట్టిగానే పడుతోంది. ఏఐ పుణ్యమాని ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు తమ స్టాఫ్‌ను తగ్గించుకుంటున్నాయి. భారత్‌లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తన మొత్తం ఉద్యోగులలో 2 శాతం మందికి ఉద్వాసన పలకనున్నది. వచ్చే ఏడాది కల్లా దాదాపు 12,200 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడనున్నది. మధ్య స్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగులపై అధికంగా వేటు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే కృతివేశన్ మనీకంట్రోల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అత్యంత వేగంగా సాంకేతిక మార్పులు చోటుచేసుకుంటున్న వేళ భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సంసిద్ధంగా ఉండక తప్పదని ఆయన అన్నారు. ఉద్యోగుల సంఖ్యను ఎందుకు తగ్గించవలసి వస్తోందన్న ప్రశ్నకు యావత్ ఐటీ పరిశ్రమ మార్పు చెందుతున్నదని, పని చేసే విధానాలు మారుతున్నాయని ఆయన బదులిచ్చారు. 2025 జూన్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 6.13 లక్షల మంది టీసీఎస్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 2 శాతం మంది అంటే సుమారు 12,200 మంది ఉంటారు. లేఆఫ్‌లు జూనియర్ లెవెల్లో కాకుండా మిడిల్ మేనేజ్మెంట్, సీనియర్ లెవెల్స్‌లో అధికంగా ఉంటాయని కృతివాసన్ స్పష్టం చేశారు.
Also Read..
Amit Shah | చిదంబరం జీ.. వారు పాక్‌కు చెందిన ఉగ్రవాదులేనని చెప్పడానికి ప్రూఫ్స్ ఉన్నాయి : అమిత్ షా
Amit Shah | పహల్గాం దాడి ఉగ్రవాదుల్లో ముగ్గుర్ని హతమార్చాం.. సిందూర్‌పై చర్చ సందర్భంగా అమిత్ షా
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

