Fisherman gets iphones | అదృష్టం ఉంటే ఏదో ఒక రూపంలో తలుపు తడుతూనే ఉంటుంది. కొందరి అదృష్టం ఎలా ఉంటుందంటే.. ఒక్కసారిగా కోటీశ్వరులైపోతారు. తాజాగా ఒక మత్స్యకారుడికి అదృష్టదేవత పలకరించింది. రోజులాగే సముద్రంలోకి చేపలు పట్టేందుకు వెళ్లిన అతనికి వలలో లక్షలు విలువ చేసే వస్తువులు దొరికాయి. అవి చూసిన అతనికి పట్టలేనంత సంతోషం కలిగింది.
వివరాల్లోకి వెళితే..
ఇండోనేషియాలోని బెలితుంగ్ ప్రాంతానికి చెందిన మత్స్యకారుడు పేదరికంతో జీవితం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే సముద్రంలో చేపల వేటకు వెళ్లిన అతనికి విసిరిన వల బరువెక్కినట్టు అనిపించింది. దీంతో వల మొత్తం లాగిన తర్వాత అతను చూసేసరికి అందులో చేపలకు బదులు ఏవో పెట్టెలు కనిపించాయి. అతను ఈ పెట్టెలను తెరిచిచూడగా.. అందులో యాపిల్ ఐఫోన్లు, మ్యాక్ బుక్ లాప్‌టాప్‌లు ఉన్నాయి. వాటి ఖరీదు లక్షల్లోనే ఉంటుంది.
ఈ మొత్తం సంఘటనని ఆ మత్స్యకారుడు వీడియో తీసి టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. పెట్టెలో ఉంచిన ఉత్పత్తులు నీటి వల్ల పాడైపోలేదని మత్స్యకారుడు వీడియోలో చెప్పాడు. వస్తువులు ఏవీ పాడవకుండా ప్యాకింగ్ చాలా బాగా చేశారని అన్నాడు.