వాషింగ్టన్: అమెరికాలో తొలి ఒమిక్రాన్ (Omicron) కేసు నమోదయింది. గతనెల 22న దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి పాజటివ్ వచ్చిందని, అతనిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని వైట్‌హౌజ్ వర్గాలు ప్రకటించాయి. ఆ వ్యక్తి నవంబర్ 22న దక్షిణాఫ్రికా నుంచి కాలిఫోర్నియాకు (California) వచ్చాడని, అదేనెల 29న అతనికి పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. అతడు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాడని వెల్లడించారు. అతని సంబంధీకును పరీక్షించామని, వారికి నెగెటివ్ వచ్చిందని ప్రకటించారు.
అమెరికా పౌరులంతా త్వరగా పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, వీలైనవాళ్లు బూస్టర్ డోసు తీసుకోవాలని చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌసీ (Dr Anthony Fauci) చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
South Africa returnee is US' first confirmed case of #Omicron coronavirus variant in California, says Dr Anthony Fauci, Chief Medical Advisor to US President
— ANI (@ANI) December 1, 2021
"The individual was fully vaccinated & experienced mild symptoms which are improving at this point," Dr Fauci says pic.twitter.com/a88tpUQ8kC
కాగా, సౌదీ అరేబియా, యూఏఈలో కూడా మొదటిసారిగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఫ్రికాకు చెందిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు సౌదీ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా ఆఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళకు ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని యూఏఈ అధికారులు వెల్లడించారు.