టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అకాశం నుంచి భారీ ఫైర్ బాల్స్ ( Fire balls ) జారిపడ్డాయి. అత్యంత వేగంగా అవి అకాశం నుంచి భూమివైపు దూసుకువచ్చినట్లు స్థానికులు తెలిపారు. నిప్పులు చిమ్ముతూ దూసుకొస్తున్న ఫైర్ బాల్స్‌ను చూసి భయాందోళనకు గురైనట్లు టెక్సాస్ వాసులు వెల్లడించారు. కాగా, ఫైర్ బాల్స్ భూమి వైపు దూసుకొస్తున్న దృశ్యాలు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసా కెమెరాకు చిక్కాయి. కొందరు టెక్సాస్ వాసులు కూడా ఆ దృశ్యాలను తమ మొబైల్‌లలో బంధించి సోషల్ మీడయాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.
అయితే, ఇలా అకాశం నుంచి ఫైర్‌బాల్స్ జారిపడటం కొత్తేమి కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఫైర్ బాల్స్ జారిపడటాన్ని ఉల్కాపాతం అంటారని, ఆకాశం నుంచి జారిపడే సందర్భంలో ఫైర్ బాల్స్ బాగా కాంతి వెదజల్లుతాయని వారు తెలిపారు. టెక్సాస్‌లో గత ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఫైర్ బాల్స్ కనిపించాయని అమెరికన్ ఉల్కాపాతం సొసైటీ వెల్లడించింది. టెక్సాస్‌తోపాటు దాని పరిసర ప్రాంతాల వాసులు కూడా ఈ దృశ్యాలను చూశారని తెలిపింది.
Fireball this evening over Austin, Texas as seen from this @Tesla dashcam driving on Mopac @EvilMopacATX #KXAN pic.twitter.com/14dvGv1gKD
— Nick Bannin (@nickbannin) July 26, 2021
ఆదివారం రాత్రి మొత్తం 213 ఫైర్ బాల్స్ అకాశం నుంచి దూసుకువచ్చినట్లు అమెరికన్ ఉల్కపాతం సొసైటీ తెలిపింది. ఈ ఫైర్ బాల్స్ 3 నుంచి 4 సెకన్లపాటు అకాశంలో కనిపించి ధ్వనులు విడుదల చేశాయని, ఇదొక రకమైన ఉల్కపాతమని పేర్కొన్నది. మరోవైపు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా సైతం అకాశం నుంచి కిందికి జారిపడ్డ ఫైర్ బాల్స్ ఉల్కపాతమేనని నిర్ధారించింది. ఉల్కపాతమనేది సర్వసాధారణమని, ఫైర్ బాల్స్ వల్ల పెద్దగా నష్టం జరిగిన దాఖలాలు ప్రపంచంలో ఎక్కడా లేవని నిపుణులు తెలిపారు.