Fighter Jet Crash | బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-7 విమానం సోమవారం కళాశాల క్యాంపస్‌లో కూలిపోయింది. విమానం కళౠశాల భవనంపై కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా.. 160 మందికిపైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో మైల్స్టోన్ కళాశాలలో విద్యార్థులు ఉన్నారు. విమానం కూలిన తర్వాత కళాశాలలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత సంఘటనా స్థలానికి అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. నేషనల్ బర్న్ ఇన్స్టిట్యూట్ అధికారి ప్రొఫెసర్ మొహమ్మద్ సైదుర్ రెహమాన్ మాట్లాడుతూ, మైల్స్టోన్ కళాశాల క్యాంపస్‌లో వైమానిక దళ విమానం కూలిపోయిందని చెప్పారు.
విమానం పైలట్ సహా కనీసం 19 మంది ఈ ప్రమాదంలో మరణించారన్నారు. హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం సీనియర్ అధికారి ప్రమాదాన్ని ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న బంగ్లాదేశ్ ఆర్మీ బృందం, అగ్నిమాపక దళం, సివిల్ డిఫెన్స్ టీమ్ వాహనాలను మోహరించి సహాయక చర్యలు చేపట్టాయి. ఢాకాలోని ఉత్తర ప్రాంతంలోని దియాబారి ప్రాంతంలోని మైల్స్టోన్ స్కూల్, కళాశాల క్యాంపస్‌లో వైమానిక దళ శిక్షణ విమానం F-7 BGI కూలిపోయిందని బంగ్లాదేశ్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ తెలిపింది. మధ్యాహ్నం 1.06 గంటలకు శిక్షణ విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయిందని అధికారులు తెలిపారు. ప్రమాదం తర్వాత విమానం మంటలు చెలరేగాయి.
మంటలను ఆర్పడానికి ఎనిమిది అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మైల్స్టోన్ స్కూల్, కళాశాల ప్రతినిధి మాట్లాడుతూ విమానం పాఠశాల గేటు దగ్గర పడిపోయిందని చెప్పారు. విమానం కూలిపోయిన పాఠశాల ఆవరణలో తరగతులు జరుగుతున్నాయన్నారు. గాయపడిన వారిని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ మీడియా.. విమానం పాఠశాల భవనాన్ని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి సద్మాన్ రుహ్సిన్ తెలిపారు. సైన్యం, అగ్నిమాపక దళం సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను తల్లిదండ్రులను సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లారు.
గాయపడిన విద్యార్థులను ఆర్మీ సిబ్బంది రక్షించారు. విమానం కళాశాల క్యాంపస్‌ను ఢీకొట్టినప్పుడు తాను పది అంతస్తుల కళాశాల భవనం దగ్గర నిలబడి ఉన్నానని పాఠశాల ఉపాధ్యాయుడు చెప్పాడు. మధ్యాహ్నం 1 గంట తర్వాత, విమానం దాని పక్కనే ఉన్న మూడు అంతస్తుల పాఠశాల భవనం ముందు భాగాన్ని ఢీకొట్టిందని, కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులను రక్షించడానికి పరుగులు తీశారన్నారు. తాను ఓ గాయపడిన విద్యార్థిని తీసుకువచ్చానని.. కాలిపోయిన స్థితిలో ఉన్న ఓ మహిళా ఉపాధ్యాయురాలిని చూశానని సదరు ఉప్యాధ్యాయుడు వివరించారు.
A Bangladesh Air Force Chengdu F-7 BGI crashes onto a school campus in Dhaka’s northern Uttara area, killing at least 1 person and injuring others, according to the military and a fire official.
The aircraft crashed on a campus of the Milestone School and College in Dhaka’s… pic.twitter.com/SWwCpxcW4Y
— Breaking Aviation News & Videos (@aviationbrk) July 21, 2025