Huge Fire | ఇరాక్ (Iraq)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం (Huge Fire) సంభవించింది. ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
తూర్పు ఇరాక్‌లోని కుట్ (Kut) నగరంలోని ఓ హైపర్ మార్కెట్ (hypermarket)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో కనీసం 50 మంది మరణించినట్లు ప్రావిన్స్ గవర్నర్‌ను ఊటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ ఐఎన్ఏ నివేదించింది. అనేక మంది గాయపడ్డట్లు పేర్కొంది.
بالفيديو | واسط : هذا ما تبقى من “هايبر ماركت الكوت” الذي أتت عليه النيران بالكامل ، بعد أيام قليلة من افتتاحه#قناة_الغدير_الخبر_في_لحظات pic.twitter.com/QqOQ1OVCSY
— قناة الغدير (@alghadeer_tv) July 16, 2025
ఐదు అంతస్తుల భవనంలో రాత్రిపూట మంటలు చెలరేగినట్లు ఐఎన్ఏ తెలిపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకూ తెలియరాలేదు. ప్రాథమిక దర్యాప్తు ఫలితాలు 48 గంటల్లో ప్రకటిస్తామని గవర్నర్ చెప్పినట్లు ఐఎన్ఏ నివేదించింది. ఈ ఘటన నేపథ్యంలో బిల్డింగ్, మాల్ యజమానిపై కేసులు బుక్ చేసినట్లు వెల్లడించారు. బిల్డింగ్ నుంచి మంటలు ఎగసిపడుతున్న దృష్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Also Read..
Trump Tariffs | 150 దేశాలపై 10 లేదా 15 శాతం సుంకాలు: డొనాల్డ్ ట్రంప్
US Visa | అమెరికాలో అలా చేస్తామంటే కుదరదు..! యూఎస్ ఎంబసీ వార్నింగ్..!
Earthquake | అలస్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ