Trump Tariffs | 150 దేశాలపై 10 లేదా 15 శాతం సుంకాలు: డొనాల్డ్ ట్రంప్
ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 150కిపైగా దేశాలపై 10 లేదా 15 శాతం సుంకాలు (Trump Tariffs) విధించనున్నట్లు ప్రకటించారు.
వాషింగ్టన్: ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 150కిపైగా దేశాలపై 10 లేదా 15 శాతం సుంకాలు (Trump Tariffs) విధించనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఆయా దేశాలకు సుంకాల రేట్లు తెలియజేస్తూ లేఖలు పంపనున్నట్లు వెల్లడించారు. 150కిపైగా దేశాలకు నోటీసులు పంపించనున్నామని, అందులోనే సుంకం రేటు పేర్కొంటామని చెప్పారు. ఈ దేశాలన్నింటికీ ఒకే విధంగా సుంకాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. అవన్నీ పెద్ద దేశాలు కాదని, తమతో అంతగా వ్యాపారం చేయవని పేర్కొన్నారు. ఈ సుంకాలు 10 లేదా 15 శాతం ఉంటే అవకాశం ఉందని చెప్పారు.
మరోవైపు రష్యాతో వాణిజ్యం దేశాలపై 500 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఓ బిల్లును కూడా తీసుకురానున్నట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం (Lindsey Graham) ఇటీవల తెలిపారు. ఇదేవిధమైన ప్రకటన నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ చేశారు. రష్యాతో వ్యాపారం కొనసాగించే దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలను ఎదుర్కోవలసి వస్తుందని భారత్, చైనా, బ్రెజిల్‌ని హెచ్చరించారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అదనంగా 100 శాతం ఆంక్షలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. ‘మీరు భారత ప్రధాని అయినా, చైనా అధ్యక్షుడు అయినా లేక బ్రెజిల్ అధ్యక్షుడు అయినా.. రష్యాతో వాణిజ్యం ఇంకా కొనసాగిస్తూ వారి చమురు, గ్యాస్‌ని కొనుగోలు చేస్తుంటే మీపై అదనంగా 100 శాతం ఆంక్షలు విధిస్తాను’ అంటూ రూట్ ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారిన నేపథ్యంలో నాటో ప్రధాన కార్యదర్శి నుంచి ఈ హెచ్చరికలు జారీకావడం గమనార్హం. ఈ మూడు దేశాల నాయకులు శాంతి చర్చలపై దృష్టి కేంద్రీకరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు.
తాను చేస్తున్న హెచ్చరికను ఈ మూడు దేశాల నాయకులు పరిగణనలోకి తీసుకోని పక్షంలో తీవ్రంగా నష్టపోతారని కూడా ఆయన హెచ్చరించారు. శాంతి చర్చలకు కట్టుబడి ఉండాలని పుతిన్‌ని ప్రత్యక్షంగా పిలుపునివ్వాలని మూడు దేశాల నాయకులను ఆయన కోరారు. శాంతి చర్చలను సీరియస్‌గా తీసుకోవాలని పుతిన్‌కి ఫోన్ చేసి నేరుగా చెప్పాలని ఆయన తెలిపారు. అలా చేయకపోతే భారత్, బ్రెజిల్, చైనా భారీస్థాయిలో దెబ్బ తింటాయని ఆయన చెప్పారు. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని ఇటీవలే ప్రకటించారు. అంతేగాక ఉక్రెయిన్‌తో 50 రోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోకపోతే రష్యా ఎగుమతులపై 100 శాతం సుంకాలు విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- Donald Trump
- India
- Russia
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

