లండన్: యూరోప్ మండిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. అడువుల్లో చెలరేగుతున్న దావానలం కొన్ని దేశాల్లో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. పశ్చిమ యూరోప్ దేశాల్లో టెంపరేచర్లు హీటెక్కిస్తున్నాయి. ఉత్తరం దిశగా ఆ బలమైన హీట్‌వేవ్ కొనసాగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్‌తో పాటు బ్రిటన్‌లో హీట్ వార్నింగ్ జారీ చేశారు. ఇక స్పెయిన్‌లో ఏకంగా 43 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్, గ్రీస్ దేశాల్లో కార్చిచ్చులు చుట్టేస్తున్నాయి. దీంతో వేలాది మంది జనం నివాస ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. బ్రిటన్‌లో హాటెస్ట్ డే నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫ్రాన్స్‌లో హీట్ అపోకలిప్స్ జరుగుతుందని భావిస్తున్నారు.