ఖాట్మాండు : నేపాల్‌లోని రూపందేహి జిల్లాలో ప్రమాదవశాత్తు బస్సు నదిలో పడిపోయింది. భైరహవాన్ – పరాసి రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోహిణి నదిలో పడిపోగా.. తొమ్మిది మంది మృతి చెందారు. మరో 23 గాయపడగా.. క్షతగాత్రులను భైరహవాన్ మెడికల్ కాలేజీకి తరలించగా.. చికిత్స పొందుతున్నారు.
ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో జనక్‌పూర్ నుంచి భైరవన్ వైపు వస్తున్న బస్సు రోహిణి వంతెన రెయిలింగ్ విరిగి నదిలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను బయటకు తీసి.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారని రూపందేహి ట్రాఫిక్ పోలీస్ చీఫ్ కేశవ్ కెసి తెలిపారు. మృతులను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.