సోమవారం 30 నవంబర్ 2020
International - Nov 22, 2020 , 09:59:39

‘రెజెనెరాన్‌’ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఎఫ్‌డీఏ అనుమతి

‘రెజెనెరాన్‌’ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఎఫ్‌డీఏ అనుమతి

వాషింగ్టన్‌ : తేలికపాటి నుంచి మధ్యస్త లక్షణాలతో బాధపడుతున్న రోగులు, వైరస్‌ తీవ్రతను నివారించేందుకు రెజెనెరాన్‌ ఫార్మాస్యూటికల్‌ డ్రగ్‌ వినియోగానికి అమెరికా ఎఫ్‌డీఏ (ఫుడ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌) అనుమతి ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ గత నెలలో మహమ్మారి బారినపడగా.. ఆయనకు ప్రయోగాత్మకంగా ఈ వ్యాక్సిన్‌ ఇచ్చారు. వ్యాక్సిన్‌ను ఐవీ ద్వారా ఇవ్వగా.. పెద్దలు, 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో కనీసం 88 పౌండ్ల (40 కిలోగ్రాములు) ఉండాలి. వైద్య పరిస్థితుల కారణంగా కొవిడ్‌-19తో తీవ్ర అ్వస్థతకుగురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అత్యవసర అనుమతి, అధ్యయనాలు, భద్రత, సమర్థతను దృష్టిలో పెట్టుకొని ఔషధాన్ని వినియోగించేందుకు అనుమతి ఇచ్చినట్లు ఎఫ్‌డీఏ తెలిపింది. తాజాగా ఇచ్చిన అనుమతితో మూడు లక్షల డోసులు అందుబాటులోకి తెస్తామని రెజెనెరాన్‌ పేర్కొంది. అయితే రోగుల నుంచి వ్యాక్సిన్‌కు ఎలాంటి ఫీజు వసూలు చేయడం లేదని, కానీ ఐవీ ఖర్చులో కొంత చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. ఇప్పటికే అమెరికాలో పది మిలియన్లకుపైగా జనం మహమ్మారి బారినపడ్డారు. వ్యాక్సిన్‌కు తాతాల్కికంగా ఆమోదంఇచ్చామని, పూర్తి ఆమోదం కోసం మరిన్ని భద్రత, పరీక్షల ఫలితాలు వెల్లడించాల్సి ఉంటుందని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.