International
- Jan 08, 2021 , 01:43:37
ట్రంప్‌కు ‘సోషల్' ఝలక్

వాషింగ్టన్, జనవరి 7: ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను నిరవధికంగా నిలిపి వేస్తున్నట్టు ఫేస్బుక్ సంస్థ ప్రకటించింది. అధికార మార్పిడి జరిగేంత వరకు ఈ నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది. ‘గత 24 గంటల్లో జరిగిన ఘటనలను చూస్తే శాంతియుత, చట్టబద్ధమైన అధికార మార్పిడికి ట్రంప్ సిద్ధంగాలేరని అర్థమవుతున్నది’ అని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు. క్యాపిటల్‌పై దాడి అనంతరం ట్రంప్ పోస్టు చేసిన వీడియోను కూడా ఫేస్బుక్, యూట్యూబ్ సంస్థలు తొలిగించాయి. ఈ వీడియో తమ పాలసీకి విరుద్ధమని పేర్కొన్నాయి. మరోవైపు, ట్రంప్ ఖాతాను 12 గంటలపాటు లాక్ చేస్తున్నట్టు ట్విట్టర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ట్రంప్ ట్వీట్ చేసిన మూడు పోస్టులు విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొంటూ వాటిని తొలిగించింది.
తాజావార్తలు
MOST READ
TRENDING