F 35 fighter jet | అగ్రరాజ్యం అమెరికాలో ఓ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. సెంట్రల్ కాలిఫోర్నియాలోని నావల్ ఎయిర్ స్టేషన్ లెమూర్ (California naval base) వద్ద ఎఫ్-35 ఫైటర్ జెట్ (F 35 fighter jet) బుధవారం కూలిపోయినట్లు యూఎస్ నేవీ ధృవీకరించింది. అయితే, ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడినట్లు తెలిపింది. పైలట్‌కు ఎలాంటి గాయాలూ కాలేదని పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4:30 గంటలకు జరిగింది. ఫైటర్ జెట్ కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన దృష్యాలు వైరల్ అవుతున్నాయి. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు యూఎస్ నేవీ తెలిపింది.
ఎఫ్-35 ఫైటర్ జెట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ఒకటి. దీన్ని యూఎస్ రక్షణ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసిన ఐదో తరం స్టెల్త్ మల్టీరోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్. దీని ధర సుమారు 115 మిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఈ జెట్ షార్ట్ టేకాఫ్‌తోపాటు వర్టికల్ ల్యాండింగ్ అవుతుంది. అమెరికా సహా అతికొద్ది దేశాల ఎయిర్‌ఫోర్సుల వద్దే ఈ ఫైటర్ జెట్ ఉంది. ఇటీవలే బ్రిటన్ దేశానికి చెందిన ఎఫ్-35 బీ కేరళలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్యల కారణంగా తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన ఫైటర్ జెట్.. దాదాపు 40 రోజుల అనంతరం బ్రిటన్‌కు వెళ్లిపోయింది.
Also Read..
Klyuchevskoy volcano | భారీ భూకంపం తర్వాత.. రష్యాలో బద్ధలైన క్లూచెవ్స్కోయ్ అగ్నిపర్వతం
Air Traffic Glitch | ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య.. రద్దైన వందలాది విమానాలు