Elon Musk | బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) తన సృజనాత్మకతతో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. తన సంస్థ రూపొందించిన డ్రైవర్ రహిత కారు ‘రోబో ట్యాక్సీ’ (Robo Taxi)ని ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో జరిగిన ‘వీరోబో’ కార్యక్రమంలో ఈ ట్యాక్సీని ప్రదర్శించారు. రెండు డోర్లతో ఉన్న ఈ కారుకు స్టీరింగ్ వీల్, పెడల్స్ లేకపోవడం విశేషం.
పూర్తిగా ఎలక్ట్రిక్ కారు ఇది. 30 వేల డాలర్ల కంటే తక్కువకే ఇది అందుబాటులో ఉంటుందని మస్క్ పేర్కొన్నారు. సాధారణ వాహనాల కంటే ఇది 10 నుంచి 20 రెట్లు సురక్షితంగా ఉంటుందని టెస్లా సీఈవో వెల్లడించారు. దీన్ని మస్క్ సైబర్ క్యాబ్‌గా పరిచయం చేశారు. 2027 లోపు ఈ ట్యాక్సీని అందుబాటులోకి తెస్తామని ప్రామిస్ చేశారు.
Robotaxi & Robovan pic.twitter.com/pI2neyJBSL
— Tesla (@Tesla) October 11, 2024
ఇదే కార్యక్రమంలో రోబో వ్యాన్‌ను కూడా మస్క్ ఆవిష్కరించారు. ‘ది రోబోవాన్’ (The Robovan) పేరుతో దీన్ని పరిచయం చేశారు. దీని చక్రాలు బయటకు కనిపించవు. మూవింగ్ టోస్టర్ లాగా కనిపించే ఈ వాహనంలో స్టీరింగ్ వీల్, పెడల్స్, డ్రైవర్ ఉండరు. ఇందులో 20 మంది వరకూ ప్రయాణించొచ్చు. సరకులు రవాణా చేసేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. వ్యాన్ లోపలో ఎంతో లగ్జరీగా, స్పేసియస్‌గా ఉంది. ఇక మస్క్ ఆవిష్కరించిన ఈ ‘రోబో ట్యాక్సీ’, ‘రోబో వ్యాన్’ (Robovan) విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Robovan details pic.twitter.com/Pdito0dfRq
— Tesla (@Tesla) October 11, 2024
Optimus is your personal R2D2 / C3PO, but better
It will also transform physical labor in industrial settings pic.twitter.com/iCET3a9pd8
— Tesla (@Tesla) October 11, 2024
Also Read..
Haryana: అక్టోబర్ 15వ తేదీన హర్యానాలో ప్రమాణ స్వీకారోత్సవం
Nara Rohit | పెళ్లి పీటలెక్కబోతున్న నారా రోహిత్.. ఆ హీరోయిన్‌తో మూడు రోజుల్లో నిశ్చితార్థం