పంచకులా: హర్యానా(Haryana)లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ 15వ తేదీన కొత్త ప్రభుత్వం అక్కడ కొలువుదీరనున్నది. ఆ రోజున ప్రమాణ స్వీకారం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం పంచకులలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అక్టోబర్ 15వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండే అవకాశాలు ఉన్నట్లు అధికారి వెల్లడించారు. వేడుక కోసం వేదికను ప్రిపేర్ చేస్తున్నట్లు పంచకుల డిప్యూటీ కమీషనర్ డాకట్ర్ యశ్ గార్గ్ తెలిపారు. ఏర్పాట్ల కోసం జిల్లా స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మార్చి నెలలో మనోహర్ లాల్ ఖట్టర్‌ను తప్పించి నయాబ్ సింగ్ సైనీని సీఎం చేసిన విషయం తెలిసిందే. అయితే బీసీ నేత నయాబ్ సింగ్ సైనీనే సీఎంగా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధాని మోదీతో పాటు కొందరు సీనియర్ బీజేపీ నేతలు ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. 90 స్థానాలు ఉన్న హర్యానాలో.. బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది.