Elon Musk | అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలల పాటు చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమిపైకి తిరిగొచ్చారు. దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వారు బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. స్పేస్ఎక్స్ కంపెనీకి చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఆస్ట్రోనాట్స్ భూమికి చేరారు. వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత పుడమికి చేరిన వారికి యావత్తు ప్రపంచం వెల్కమ్ చెప్పింది.
వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంపై స్పేస్ఎక్స్ (SpaceX) అధినేత ఎలాన్ మస్క్ హర్షం వ్యక్తం చేశారు. సునీతను విజయవంతంగా భూమికి చేర్చినందుకు నాసా, స్పేస్ ఎక్స్ బృందాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మిషన్‌ను అత్యంత ప్రాధాన్యామిచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు (Elon Musk on Sunita williams safe return). ఇక సునీత రాక సందర్భంగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత బైడెన్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను ఇంతకంటే ముందుగానే తిరిగి తీసుకొస్తామని స్పేస్ఎక్స్ ప్రతిపాదిస్తే అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ తిరస్కరించారని అన్నారు. రాజకీయ కారణాలతో వద్దని అన్నారని ఆరోపించారు. ‘ఇంతకంటే ముందుగానే వ్యోమగాములను తిరిగి తీసుకొస్తామని ఆఫర్ చేశాము. అందులో సందేహమే లేదు. వాస్తవానికి ఆస్ట్రొనాట్స్ 8 రోజుల పాటు అంతరిక్షంలో గడిపి రావాలి. కానీ దాదాపు 10 నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. స్పేస్ ఎక్స్ వారికి కొద్ది నెలల్లోనే తిరిగి తీసుకొచ్చి ఉండేది. ఈ ప్రతిపాదనను మేము బైడెన్ ప్రభుత్వం ముందు ఉంచాం. కానీ ఆయన మా ప్రతిపాదనను తిరస్కరించారు. రాజకీయ కారణాలతో బైడెన్ ప్రభుత్వం మా ప్రతిపాదనకు ఒప్పుకోలేదు’ అని మస్క్ ఆరోపించారు.
.@elonmusk reveals the Biden administration turned down his offer to get the stranded astronauts home sooner: 🚨“It was rejected for political reasons.” 🚨 pic.twitter.com/hN4pPk3YN1
— Trump War Room (@TrumpWarRoom) March 19, 2025
Also Read..
Sunita Williams | సునీతా విలియమ్స్ వచ్చేసింది.. ఫ్లోరిడాలో సురక్షితంగా దిగిన క్రూ డ్రాగన్
PM Modi | వెల్ కమ్ బ్యాక్.. భూమి మిమ్మల్ని మిస్ అయింది.. సునీత రాకపై ప్రధాని మోదీ పోస్ట్
Sunita Williams | త్వరలో భారత్‌కు రానున్న సునీత విలియమ్స్.. బంధువుల వెల్లడి