Sunita Williams | సునీతా విలియమ్స్ వచ్చేసింది.. ఫ్లోరిడాలో సురక్షితంగా దిగిన క్రూ డ్రాగన్
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సుదీర్ఘ నిరీక్షత తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమిపైకి తిరిగొచ్చారు. దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమె బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు.
Sunita Williams | భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సుదీర్ఘ నిరీక్షత తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమిపైకి తిరిగొచ్చారు. దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమె బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. ఆమెతోపాటు ఆస్ట్రోనాట్స్ బుచ్ విల్మోర్, నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గుర్బునోవ్ భూమిపైకి చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.35 గంటలకు ఐఎస్ఎస్ నుంచి బయల్దేరిన నాసా, స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ-9 డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్ 17 గంటలపాటు ప్రయాణించి బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగింది.

గంటకు 17 వేల మైళ్ల వేగంతో భూమివైపుగా ప్రయాణించిన ఈ డ్రాగన్ క్యాప్సుల్ క్రమంగా తన వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో దాని వేగం గంటకు 116 మైళ్లకు చేరుకున్నాక పారాచూట్లు తెరచుకున్నాయి. 4 పారాచూట్ల సాయంతో వేగాన్ని మరింత తగ్గించుకొని క్యాప్సుల్ సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. ఆ తర్వాత నాసా సిబ్బంది అక్కడికి చేరుకొని చిన్న బోట్ల సహాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. అనంతరం వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇన్నాళ్లు ఐఎస్ఎస్లో జీరో గ్రావిటీలో గడిపిన ఈ వ్యోమగాములు ఇప్పుడు ఇక్కడ భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందించనున్నారు. కాగా, కేవలం 8 రోజుల యాత్ర కోసం గతేడాది జూన్ 5న ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత, విల్మోర్.. ఏకంగా 286 రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది.

2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్‌లైనర్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం అదే నెల 14న వారిద్దరు భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్‌షిప్‌లో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వ్యోమగాములు లేకుండానే స్టార్‌లైనర్ భూమిని చేరుకుంది. దీంతో వీరిద్దరూ దాదాపు 9 నెలలు అంతరిక్ష కేంద్రంలోనే గడపాల్సి వచ్చింది.
Life of #Astronaut in #Space.#SunitaWilliams#SpacexDragon#ElonMusk
Credit RocketTestOne pic.twitter.com/fRqMwGPsGb— Shailey Singh (@shaileysingh73) March 17, 2025
యాత్ర సాగిందిలా..
- భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.15 గంటలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక తలుపు మూసివేత ప్రక్రియ జరిగింది.
- ఉదయం 10.15 గంటలకు అది ఐఎస్ఎస్తో విడిపోవడం (అన్‌డాకింగ్) ప్రారంభమైంది. 10.35 గంటలకు పూర్తిగా విడిపోయింది. అనంతరం భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది. దీనికోసం పలుమార్లు రాకెట్ ప్రజ్వలన విన్యాసాలు చేపట్టింది.
Drogue and main parachutes have deployed pic.twitter.com/X0wiXqFaPt
— SpaceX (@SpaceX) March 18, 2025
- భూమిపై ల్యాండింగ్ ప్రదేశం దిశగా క్రూ డ్రాగన్ ముందుభాగంలోని నాలుగు డ్రాకో ఇంజిన్ల ప్రజ్వలన మొదలైంది. ఏడున్నర నిమిషాలపాటు ఈ ప్రక్రియ సాగింది. తర్వాత భూవాతావరణంలో కి రీ ఎంట్రీ కోసం కోన్ భాగాన్ని వ్యోమనౌక మూసివేసింది. రీ ఎంట్రీ సమయంలో తలెత్తే తీవ్రస్థాయి వేడి నుంచి వ్యోమగాములను సురక్షితంగా ఉంటే వ్యవస్థ ఆన్ అయింది.
What a sight! The parachutes on @SpaceX‘s Dragon spacecraft have deployed; #Crew9 will shortly splash down off the coast of Florida near Tallahassee. pic.twitter.com/UcQBVR7q03
— NASA (@NASA) March 18, 2025
- బుధవారం తెల్లవారుజామున 2.51 గంటలకు కక్ష్య నుంచి విడిపోయే ప్రక్రియ పూర్తవడంతో స్పేస్ క్రాఫ్ట్ కిందికి దిగడం ప్రారంభమైంది. 3.10 గంటలకు భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అయితే అత్యంత వేగంగా ప్రయాణిస్తుండటంతో స్పేస్ ఎక్స్ గ్రౌండ్ స్టేషన్‌తో కమ్యూనికేషన్ తెగిపోవడంతో (రేడియో సైలెన్స్) కొద్దిసేపు ఉత్కంఠ ఏర్పడింది.
- 3.21 గంటలకు మళ్లీ సిగ్నల్ కలవడంతో, రేడియో సైలెన్స్‌ను ఛేదిస్తూ కమాండర్ నిక్ హేగ్ మాట్లాడటంతో కమాండ్ సెంటర్లో అందరిలో ఆనందం వెల్లివిరిసింది.
Splashdown of Dragon confirmed – welcome back to Earth, Nick, Suni, Butch, and Aleks! pic.twitter.com/M4RZ6UYsQ2
— SpaceX (@SpaceX) March 18, 2025
- సాగర జలాలకు 18 వేల అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని రెండు డ్రోగ్‌చూట్లు తెరచుకున్నాయి. దీంతో క్రూడ్రాగన్ వేగం క్రమంగా తగ్గుతూవచ్చింది. వ్యోమనౌక వేగం గంటకు 190 కి.మీ.కు చేరుకోగానే సాగర జలాలకు 6,500 అడుగుల ఎత్తులో రెండు ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి. 3.28 గంటలకు క్రూ డ్రాగన్ ఫ్లోరిడాలోని తలహాసీ తీరంలో సురక్షితంగా సముద్ర జలాల్లో దిగింది. నిమిషాల వ్యవధిలోనే స్పీడ్ బోట్లలో అక్కడికి చేరుకున్న రికవరీ బృందం.. పరిస్థితులన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత వ్యోమనౌకను మేగన్ నౌకపైకి చేర్చారు. ఆ తర్వాత లోపల ఉన్న నలుగురు వ్యోమగాములను స్పేస్ ఎక్స్ సిబ్బంది జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. తొలుక కమాండర్ నిక్ హేగ్, ఆ తర్వాత అలెగ్జాండర్, సునీతా విలియమ్స్, విల్మోర్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చారు. క్రూ డ్రాగన్ నుంచి బయటకు రాగానే సునీతా విలియమ్స్ ఆనందంతో చేతులు ఊపుతూ అభివాదం చేశారు.
They’re on their way! #Crew9 undocked from the @Space_Station at 1:05am ET (0505 UTC). Reentry and splashdown coverage begins on X, YouTube, and NASA+ at 4:45pm ET (2145 UTC) this evening. pic.twitter.com/W3jcoEdjDG
— NASA (@NASA) March 18, 2025
#Crew9 will be difficult to spot in the daytime as it reenters Earth’s atmosphere, but if you want to keep an eye out for @SpaceX‘s Dragon as it heads home today, we have the map for you. pic.twitter.com/dGmSWXbOyv
— NASA (@NASA) March 18, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

