Sunita Williams | త్వరలో భారత్కు రానున్న సునీత విలియమ్స్.. బంధువుల వెల్లడి
Sunita Williams | భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమిపైకి తిరిగొచ్చారు.
Sunita Williams | భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమిపైకి తిరిగొచ్చారు. దాదాపు 9 నెలలపాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమె బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరడంతో ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత పుడమికి చేరిన వారికి యావత్తు ప్రపంచం వెల్కమ్ చెప్పింది.
ఇక సునీత సురక్షితంగా భూమికి చేరడంతో భారత్లోని ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. గుజరాత్ రాష్ట్రంలోని ఝూలాసన్లో ఆమె బంధువులు, స్థానికులు బాణసంచా కాల్చి నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 286 రోజుల తర్వాత సునీత సేఫ్గా భూమిపైకి రావడంపై ఆమె సోదరి ఫాల్గుణి పాండ్యా సంతోషం వ్యక్తం చేశారు. సునీత కోసం తొమ్మిది నెలలుగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా అమెరికా ప్రభుత్వానికి, నాసాకు కృతజ్ఞతలు తెలిపారు. సునీత త్వరలోనే భారత్ (India)కు రానున్నట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు.
ఓ జాతీయ మీడియాతో ఫాల్గుణి మాట్లాడుతూ.. ‘తొమ్మిది నెలల విరామం తర్వాత సునీత సురక్షితంగా భూమిపైకి రావడం సంతోషంగా ఉంది. ఆమె పుడమిపైకి దిగిన క్షణాలు అపురూపం. ఎలాంటి సవాళ్లనైనా ఆమె ధైర్యంగా ఎదుర్కోగలదు. సునీత త్వరలోనే భారత్కు రానున్నారు. మేమంతా వెకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నాం. కుటుంబ సభ్యులతో చాలా సమయం గడపబోతున్నాం’ అని తెలిపారు.
Also Read..
Sunita Williams | సునీతా విలియమ్స్ వచ్చేసింది.. ఫ్లోరిడాలో సురక్షితంగా దిగిన క్రూ డ్రాగన్
NASA | భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలు.. ప్రైవేటు భాగస్వాములకు ఇదొక సరికొత్త ప్రారంభం: నాసా
Dolphins: ఆస్ట్రోనాట్స్కు వెల్కమ్ పలికిన డాల్ఫిన్లు.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- India
- ISS
- NASA
- Sunita Williams
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

