న్కూయార్క్: ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమికి తిరిగి వచ్చేశారు. ఆ వ్యోమగాములు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్ ఫ్లోరిడా సమీపంలోని తలహస్సీ తీరంలో దిగింది. ఆ సమయంలో డాల్ఫిన్లు(Dolphins).. ఆ ఆస్ట్రోనాట్స్‌కు స్వాగతం పలికాయి. సముద్ర జలాల్లోకి పారాచూట్ సహాయంతో స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ దిగగానే ఆ ప్రాంతంలో డాల్ఫిన్లు సందడి చేశాయి. క్యాప్సూల్ చుట్టూ ఈదేశాయి. సుమారు 5 డాల్ఫిన్లు.. ఆస్ట్రోనాట్స్ ఉన్న క్యాప్సూల్ చట్టూ ఈదుతూ హంగామా చేశాయి. ఆ టైంలో అక్కడే రికవరీ బోటు కూడా ఉన్నది. దీన్ని నాసా లైవ్ ప్రసారం చేసింది. టెక్సాస్‌లోని నాసా కేంద్రంలో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న శాస్త్రవేత్తలు.. డాల్ఫిన్ల వెల్కమ్ డ్యాన్స్ చూసి సంబరపడిపోయారు.
Dolphins were in the gulf to welcome the NASA astronauts home after being rescued.
Congratulations Elon for bringing back the Astronauts ! pic.twitter.com/bg8AN5FTOg
— primalkey (@primalkey) March 18, 2025
క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లో మొత్తం నలుగురు ఆస్ట్రోనాట్స్ దిగారు. సముద్రంలో ఉన్న మేఘన్ రికవరీ షిప్.. ఆ క్యాప్సూల్‌ను రికవరీ చేసుకున్నది. అయితే ఆ క్యాప్సూల్‌కు పట్టిన ఉప్పు నీటిని .. ఫ్రెష్ వాటర్‌తో కడిగేశారు. డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌కు చెందిన హాచ్ను రికవరీ వర్కర్లు ఓపెన్ చేశారు. విల్మోర్, సునీతా, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ .. క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చారు. ముందుగా వాళ్లకు హెల్త్ చెకప్ చేస్తారు. రోటీన్ ప్రక్రియ తర్వాత ఆస్ట్రోనాట్స్ తమ కుటుంబీకుల్ని కలుసుకుంటారు.
Astronauts who were stuck in space for nine months splashing down in the Gulf of America and immediately being surrounded by a pack of dolphins is one of the coolest things I’ve ever seen.
pic.twitter.com/XqKauJtFzh— Greg Price (@greg_price11) March 18, 2025