Twitter | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ (Twitter) సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) తన పదవి నుంచి తప్పుకోనున్నాడు. తన స్థానంలో నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను (CEO) ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఆరు వారాల్లో కొత్త సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపారు. అయితే ట్విట్టర్ బాస్‌గా ఎవరిని ఎంపికచేసినట్లు మాత్రం వెల్లడించలేదు. తాను ఇకపై కంపెనీ చీఫ్ టెక్నాలజిస్ట్‌గా (Chief technologist) కొనసాగనున్నట్లు చెప్పారు. ఉత్పత్తి, సాఫ్ట్వేర్, సిసోప్స్‌లను పర్యవేక్షిస్తానని మస్క్ పేర్కొన్నారు.
కాగా, నూతన సీఈఓగా ఎన్‌బీసీయూనివర్సల్ (NBCUniversal) మీడియాలో గ్లోబల్ అడ్వర్టైసింగ్ అండ్ పార్ట్నర్షిప్స్ విభాగం చైర్మన్‌గా పనిచేస్తున్న లిండా యాకారినో (Linda Yaccarino)ను మస్క్ ఎంపికచేసినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ (Wall Street Journal) వెల్లడించింది. కాగా, ట్విట్టర్లో తన సమయాన్ని కుదించుకుంటానని గతేడాది నవంబర్లోనే ఈ అపరకుబేరుడు తెలిపారు.
తాను ట్విట్టర్ సీఈఓగా కొనసాగాలా? వద్దా? అని గత డిసెంబర్లో ఓ పోల్ నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో మస్క్‌కు వ్యతిరేకంగా ఎక్కువమంది ఓట్లు వేశారు. దీంతో తాను ఆ పదవి నుంచి తప్పుకుటానని ప్రకటించారు. తన స్థానంలో మరొకరు వచ్చేవరకు సీఈవోగా కొనసాగుతానని అప్పుడే చెప్పారు. ఈ నేపథ్యంలో అత్యంత ఆధరణపొందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు కొత్త సారథిని ఎంపిక చేశారు.
Excited to announce that I’ve hired a new CEO for X/Twitter. She will be starting in ~6 weeks!
My role will transition to being exec chair & CTO, overseeing product, software & sysops.
— Elon Musk (@elonmusk) May 11, 2023