న్యూఢిల్లీ: ఒకవేళ రాబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే.. టెస్లా చీఫ్ ఎలన్ మస్క్‌ను అడ్వైజర్‌గా నియమించకోనున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ ఆఫర్‌కు స్పేస్ఎక్స్ సీఈవో మస్క్ రియాక్ట్ అయ్యారు. ట్రంప్‌కు అడ్వైజర్‌గా పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు మస్క్ వెల్లడించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని రాసి ఉన్న ఓ పోడియం వద్ద నిలుచున్న ఫోటోను మస్క్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు.
అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే, మస్క్‌కు క్యాబినెట్ హోదా ఇవ్వనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఒకవేళ తాను వైట్‌హౌజ్‌కు వస్తే, అప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వనున్నట్లు ట్రంప్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తాను ట్రంప్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రభుత్వ ఏర్పడితే, మస్క్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నట్లు ఆయన ట్వీట్ ద్వారా తెలుస్తోంది.
I am willing to serve pic.twitter.com/BJhGbcA2e0
— Elon Musk (@elonmusk) August 20, 2024