Elon Musk | వాషింగ్టన్, డిసెంబర్ 19: ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ రష్యా ఏజెంట్ అని అమెరికన్ మిలిటరీ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. విదేశీ నేతలతో జరిగిన సమావేశాల గురించి అమెరికన్ అధికారులకు తెలియజేయాలనే నిబంధన ఉన్నప్పటికీ, మస్క్ పదే పదే చాలా మంది విదేశీ నేతలతో జరిగిన సమావేశాల గురించి బయటపెట్టలేదని ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనాన్ని ప్రచురించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా మస్క్ సమావేశమయ్యారని, ఆ విషయాన్ని మస్క్ బయటపెట్టలేదని ఈ కథనం ఆరోపించింది.